Translate

Showing posts with label ANR. Show all posts
Showing posts with label ANR. Show all posts

Saturday, 30 April 2016

neevu leka veena song lyrics in telugu


Dr Chakravarthy Old Telugu Movie : neevu leka veena song lyrics in telugu

చిత్రం: డా.చక్రవర్తి
గాత్రం: పి.సుశీల
రచన: ఆత్రేయ

నీవులేక వీణా పలుకలేనన్నదీ
నీవురాక రాధా నిలువలేనన్నది
ఆఆఆ.....ఆఆ....ఆఆ..
నీవులేక వీణా...

జాజిపూలు నీకై రోజు రోజుపూచె
చూసిచూసి పాపం సొమ్మసిల్లి పోయె
చందమామనీకై తొంగి తొంగి చూసి…. 2
సరసనులేవని అలుకలుబోయె

నీవులేక వీణా...

కలలనైననిన్ను కనుల చూతమన్నా
నిదురరాని నాకు కలలు కూడరావె
కదలలేనికాలం విరహ గీతి రీతి…. 2
పరువమువృదగా బరువుగ సాగె

నీవులేక వీణా..

తలుపులన్నినీకై తెరచి వుంచి నాను
తలపులెన్నొమదిలో దాచి వేచి నాను
తాపమింకనేను ఓపలెను స్వామి …. 2
తరుణినికరుణను యేలగ రావా

నీవులేక వీణా పలుకలేనన్నది
నీవురాక రాధా నిలువలేనన్నది
నీవులేక వీణా.....

Neevu Leka Veena Song Lyrics in English

neevu leka veena palukalenannadi
neevu raaka radha niluvalenannadi
aaa.....aa....aa..
neevu leka veena...

jaji poolu neekai roju roju pooche
choosi choosi papam sommasilli poye
chandamama neekai tongi tongi choosi … 2
sarasanu levani alukaluboye

neevu leka veena...

kalalanaina ninnu kanula chootamanna
nidura rani naku kalalu kooda rave
kadalaleni kaalam viraha geeti reeti …. 2
paruvamu vrudaga baruvuga sage

neevu leka veena..

talupulanni neekai terachi vunchi nanu
talapulenno madilo daachi vechi nanu
taapaminka nenu opalenu swami …. 2
tarunini karunanu elaga rava

neevu leka veena palukalenannadi
neevu raaka radha niluvalenannadi

neevu leka veena.....

Friday, 29 April 2016

Yevandoy Sri Varu Okachinna Mata song lyrics


Emadoi srivaru oka chinna maata - Manchi Manasulu Lyrics

From Movie: Manchi Manasulu
Lyrics: Arudra


Emandoi
Emandoi srivaru oka chinna maata
Ye vooru velatharu edheekani vela
Emandoi srivaru oka chinna maata
Ye vooru velatharu edheekani vela
Emandoi

Pasi vani chuchutaku ee thondara
Mayamarachi muddhadi laalinthura
Pasi vani chuchutaku ee thondara
Mayamarachi muddhadi laalinthura
Srimathiki bahumathiga emitthuro
Icchendhuku emundhi mee daggara

Emandoi
Emandoi srivaru oka chinna maata
Ye vooru velatharu edheekani vela
Emandoi

Abbayi polika ee thandridha
Apuroopamaina aa thallidha
Abbayi polika ee thandridha
Apuroopamaina aa thallidha
Ayyagari andhalu ranicchina
Ee buddhi raaniku bhagavanthuda

Emandoi
Emandoi srivaru oka chinna maata
Ye vooru velatharu edheekani vela
Emandoi

Priyamaina maa illu vidanaadi pothe
Thala dhaachukona meeku thaavaina ledhe Hayyoo Paapam
Priyamaina maa illu vidanaadi pothe
Thala dhaachukona meeku thaavaina ledhe
Kapataalu maanesi naa madhilona
Kapataalu maanesi naa madhilona
Kaapuramu cheyandi kalakaalamu

Emandoi
Emandoi srivaru oka chinna maata
Ye vooru velatharu edheekani vela
Emandoi

Silalapai SilpAlu chekkinAru Song Lyrics

Silalapai SilpAlu chekkinAru - శిలలపై శిల్పాలు చెక్కినారు

Silalapai Silpalu Chekkinaru - Manchi Manasulu - Telugu

Song Name : Silalapai Silpalu Chekkinaru
Movie/Album : Manchi Manasulu
Singer(s) : Ghantasaala
Language : Telugu
Year Of Release : 1962

అహో ఆంధ్ర భోజా శ్రి కృష్ణా దేవరాయా
విజయ నగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా
ఈ శిధిలాలలో చిరంజీవివైనావయా

శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు
మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు
కను చూపు కరువైన వారికైనా కను చూపు కరువైన వారికైనా
కనిపించి కనువిందు కలిగించు రీతిగా కను చూపు కరువైన వారికైనా
ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు
ఒకచెంప శృంగారమొలిగించు నాట్యాలు నవరసాలొలిగించు నగరానికొచ్హాము
కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు
నా కనులు నీవిగా చేసికొని చూడు

శిలలపై||

ఏక శిల రధముపై లోకేశు ఒడిలోన ఓరచూపుల దేవి ఊరేగి రాగా
రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా
కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు
కొడుకు పుట్టాలని కోరుతున్నారని

శిలలపై||

రాజులే పోయినా రాజ్యాలు కూలినా కాలాలు పోయినా గాల్పులే వీచినా
మనుజులే దనుజులై మట్టి పాల్జేసినా అ......
చెదరనీ కదలనీ శిల్పాలవలెనె నీవు నా హౄదయాన
నిత్యమై సత్యమై నిలిచి వుందువు చెలి నిజమునా జాబిలి


చిత్రం : మంచి మనసులు
గానం : ఘంటసాల
రచన : ఆత్రేయ
సంగీతం: కె.వి.మహదేవన్


Aaduthu Paaduthu Pani Song Lyrics

Aaduthu Paaduthu Pani Song Lyrics

Old Songs, ANR, Akkineni Nageswar Rao, Gantasala, P Susheela, Kosa Raju, 1957, Master Venu, Todi Kodallu

చిత్రం: తోడి కోడళ్ళు (1957)
రచన: కొసరాజు
సంగీతం: మాస్టర్ వేణు
గానం: ఘంటసాల, పి.సుశీల
నిర్వహణ: నాగేష్


పల్లవి :
 అతడు: ఆడుతు పాడుతు పనిచేస్తూంటే
   అలుపు సొలుపేమున్నది
 ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
 మనకు కొదవేమున్నది ॥

 చరణం : 1
 అ: ఒంపులు తిరిగి ఒయ్యారంగా
   ఊపుతు విసరుతు గూడేస్తుంటే  (2)
 నీ గాజులు ఘల్లని మోగుతుంటే
   నా మనసు ఝల్లుమంటున్నది
 నా మనసు ఝల్లుమంటున్నది...
 ॥

 చరణం : 2
 ఆమె: తీరని కోరికలూరింపంగా
   ఓర కంట నను చూస్తూ ఉంటే  (2)
 చిలిపి నవ్వులు చిందులు తొక్కి...
 చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది
 నును సిగ్గు ముంచుకొస్తున్నది...  ॥

 చరణం : 3
 అ: చెదరి జారిన కుంకుమరేఖలు
   పెదవుల పైన మెరుస్తువుంటే  (2)
 తీయని తలపులు నాలో ఏమో...
 తీయని తలపులు నాలో ఏమో తికమకజేస్తూవున్నవి
 అహ... తికమకజేస్తూవున్నవి
 ఆడుతు॥

 చరణం : 4
 ఆ: మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి (2)
 పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది
 పరవశమైపోతున్నది... ఆ... ॥