Aaduthu Paaduthu Pani Song Lyrics
Old Songs, ANR, Akkineni Nageswar Rao, Gantasala, P Susheela, Kosa Raju, 1957, Master Venu, Todi Kodallu
చిత్రం: తోడి కోడళ్ళు (1957)
రచన: కొసరాజు
సంగీతం: మాస్టర్ వేణు
గానం: ఘంటసాల, పి.సుశీల
నిర్వహణ: నాగేష్
పల్లవి :
అతడు: ఆడుతు పాడుతు పనిచేస్తూంటే
అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
మనకు కొదవేమున్నది ॥
చరణం : 1
అ: ఒంపులు తిరిగి ఒయ్యారంగా
ఊపుతు విసరుతు గూడేస్తుంటే (2)
నీ గాజులు ఘల్లని మోగుతుంటే
నా మనసు ఝల్లుమంటున్నది
నా మనసు ఝల్లుమంటున్నది...
॥
చరణం : 2
ఆమె: తీరని కోరికలూరింపంగా
ఓర కంట నను చూస్తూ ఉంటే (2)
చిలిపి నవ్వులు చిందులు తొక్కి...
చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది
నును సిగ్గు ముంచుకొస్తున్నది... ॥
చరణం : 3
అ: చెదరి జారిన కుంకుమరేఖలు
పెదవుల పైన మెరుస్తువుంటే (2)
తీయని తలపులు నాలో ఏమో...
తీయని తలపులు నాలో ఏమో తికమకజేస్తూవున్నవి
అహ... తికమకజేస్తూవున్నవి
ఆడుతు॥
చరణం : 4
ఆ: మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి (2)
పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది
పరవశమైపోతున్నది... ఆ... ॥
Old Songs, ANR, Akkineni Nageswar Rao, Gantasala, P Susheela, Kosa Raju, 1957, Master Venu, Todi Kodallu
చిత్రం: తోడి కోడళ్ళు (1957)
రచన: కొసరాజు
సంగీతం: మాస్టర్ వేణు
గానం: ఘంటసాల, పి.సుశీల
నిర్వహణ: నాగేష్
పల్లవి :
అతడు: ఆడుతు పాడుతు పనిచేస్తూంటే
అలుపు సొలుపేమున్నది
ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది
మనకు కొదవేమున్నది ॥
చరణం : 1
అ: ఒంపులు తిరిగి ఒయ్యారంగా
ఊపుతు విసరుతు గూడేస్తుంటే (2)
నీ గాజులు ఘల్లని మోగుతుంటే
నా మనసు ఝల్లుమంటున్నది
నా మనసు ఝల్లుమంటున్నది...
॥
చరణం : 2
ఆమె: తీరని కోరికలూరింపంగా
ఓర కంట నను చూస్తూ ఉంటే (2)
చిలిపి నవ్వులు చిందులు తొక్కి...
చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గు ముంచుకొస్తున్నది
నును సిగ్గు ముంచుకొస్తున్నది... ॥
చరణం : 3
అ: చెదరి జారిన కుంకుమరేఖలు
పెదవుల పైన మెరుస్తువుంటే (2)
తీయని తలపులు నాలో ఏమో...
తీయని తలపులు నాలో ఏమో తికమకజేస్తూవున్నవి
అహ... తికమకజేస్తూవున్నవి
ఆడుతు॥
చరణం : 4
ఆ: మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి (2)
పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది
పరవశమైపోతున్నది... ఆ... ॥
No comments:
Post a Comment