చిన్ని తండ్రి నిను చూడగా (Chinni Tandri Ninu Choodaga - Sisindri - 1995)
చిన్ని తండ్రి నిను చూడగా | వెయ్యి కళ్ళైన సరిపోవురా
అన్ని కళ్ళూ చూస్తుండగా | నీకు దిష్టెంత తగిలేనురా
అందుకే అమ్మ ఒడిలోనే | దాగుండిపోరా

ఏ చోట నిమిషం కూడా ఉండలేడు | చిన్నారి సిసింద్రీల చిందు చూడు
పిలిచినా పలకడు | వెతికినా దొరకడు
మా మధ్య వెలిశాడు ఆ జాబిలి | ముంగిట్లో నిలిపాడు దీపావళి
నిలిచుండాలి కలకాలము | ఈ సంబరాలు

ఆ మువ్వ గోపాలుళ్ళా తిరుగుతుంటే | ఆ నవ్వే పిల్లంగోవై మోగుతుంటే
మనసున నందనం | విరియదా ప్రతి క్షణం
మా కంటి వెలుగులే హరివిల్లుగా | మా ఇంటి గడపలే రేపల్లెగా
మా ఈ చిన్ని రాజ్యానికి | యువరాజు వీడు
చందమామ చూశావటోయ్ | అచ్చు నీలాంటి మా బాబుని
నేల అద్దాన నీ బింబమై | పారాడుతుంటే

No comments:
Post a Comment