Translate

Showing posts with label Krishna. Show all posts
Showing posts with label Krishna. Show all posts

Friday, 29 April 2016

vennelaina cheekataina lyrics

vennelaina cheekataina lyrics from  Pachani Kapuram Telugu

చిత్రం : పచ్చని కాపురం (1985)
రచన : వేటూరి, సంగీతం : చక్రవర్తి
గానం : కె.జె.ఏసుదాస్, ఎస్.జానకి

పల్లవి :

వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా
నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము (2)
నింగి నేల సాక్ష్యాలు (2)
ప్రేమకు మనమే తీరాలు॥

చరణం : 1

జ్ఞాపకమేదో నీడల్లో తారాడే
స్వప్నాలేవో నీ కళ్లు దోగాడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదు
చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వము నాదైనది...
నేను దేహమల్లే నీవు ప్రాణమల్లే 
ఏకమైన రాసలీలలోనా॥

చరణం : 2

అంతంలేని ఈ రాగబంధంలో
అంచున నిలిచి నీవైపే చూస్తున్నా
పున్నమింట కట్టుకున్న పూలడోలలు
ఎన్నడింక చెప్పవమ్మ బారసాలలు
ఆ ముద్దులే మూడైనవి...
బాలచంద్రుడొస్తే నూలు పోగులిస్తా 
ఇంటిదీపమాయె జంట ప్రేమ